Sunday, February 5, 2012

భగవద్గీతపై క్రైస్తవ మిషనరీల కుట్రలు - కేసును కొట్టివేసిన రష్యన్ కోర్టు - భారత్ లోని క్రైస్తవ మిషనరీలు ఈ వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారు ?

భగవద్గీతపై క్రైస్తవ మిషనరీల కుట్రలు -

కేసును కొట్టివేసిన రష్యన్ కోర్టు 
 
 భారత్ లోని క్రైస్తవ మిషనరీలు ఈ వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారు ?
 


ధర్మాన్ని రక్షించండి.. అది మిమ్ములను రక్షిస్తుంది.. అనే ప్రాచీన సూక్తి మరోసారి నిజమయింది. ధర్మం హిందువుల ప్రక్కనే ఉన్నది కాబట్టే కుటిల క్రైస్తవ మిషనరీల ఎత్తులు పారలేదు. హిందువులు పరమ పవిత్రంగా భావించే భగవద్గీత గ్రంథంపై రష్యాలో నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్ ను టాంస్కీ  కోర్టు కొట్టివేసింది. సైబీరియాలోని ఎఫ్.ఎస్.బి., రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి కలిసి టాంస్కీ కోర్టులో 2011 జూన్ లో ఈ పిటిషన్ వేశాయి. వారు తమ పిటిషన్లో భగవద్గీతను తీవ్రవాద, విప్లవ సాహిత్యంగా పేర్కొన్నారు. టాంస్కీలో తమ ప్రాబల్యం పెంచుకొనేందుకు ఇస్కాన్ చాప కింద నీరులా ప్రయత్నిస్తోందని కూడా ఆరోపించారు.

ప్రపంచంలోని ఎన్నో భాషల్లో అనువాదమైన ఈ పవిత్ర గ్రంథాన్ని ఎన్నో దేశాలు ఆరాధించాయి, హోలీ గ్రంథంగా గుర్తించాయి. వేదవ్యాస ముని వ్రాసిన భగవద్గీతను ఇస్కాన్ వ్యవస్థాపక గురువు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రష్యన్ భాషలోకి అనువదించారు. దీంతో మతమార్పిడే నైజంగా జీవిస్తున్న మిషనరీలు, వారి ఫాదర్లు, పాస్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ రష్యన్లు ఈ గ్రంథానికి ఆకర్షితులయి కృష్ణ భక్తులుగా మారిపోతారోనని భయపడి, తమ కుట్రలను ప్రారంభించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఎవరూ కనిపెట్టని వంకలన్నీ గీతకు ఆపాదించారు. దీనికి అక్కడి యూనివర్శిటీ అధికారులు కూడా తోడయ్యారు. కోర్టు సిఫారసులతో గ్రంథాన్ని పరిశీలించిన యూనివర్శిటీ కమిటీ సభ్యులు భగవద్గీత మత, లింగ, జాతి, భాషా ద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని చెప్పగా, మనుష్యుల మధ్య చిచ్చు రేపేదిగా  ఉందని రష్యా సర్కార్ భావించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. రష్యాలో పుస్తకాన్ని అచ్చు వేసినా, కలిగి ఉన్నా, పట్టుకొని తిరిగినా ప్రమాదకరమైన నేరంగా భావించి దారుణంగా శిక్షించాలనే సిఫారసులు అందాయనే వార్తలు హిందువులను తీవ్ర కలవరానికి గురి చేశాయి. రష్యన్ల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులతో పాటు కృష్ణ భక్తులను కూడా ఆగ్రహానికి గురి చేసింది.

మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఈ గ్రంథాన్ని కళ్ళకద్దుకొని స్వీకరిస్తుంటే, రష్యా ప్రభుత్వం క్రైస్తవ మిషనరీల కుట్రలకు వంత పాడుతూ నిషేధించేందుకు యత్నించడంతో హిందువులలో కోపం కట్టలు తెంచుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను సైతం తప్పు పట్టారు. ప్రధాని రష్యా పర్యటనకు ముందే రష్యన్ క్రైస్తవ మిషనరీల కుట్రలను వివరిస్తూ భారత్ లోని ఇస్కాన్ ప్రతినిధులు, అటు రష్యాలోని ఇస్కాన్ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయానికి సైతం లేఖలు రాసి ఈ దురాగతాన్ని ఆపాలని కోరారు. అయితే భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా ప్రధాని ఫుతిన్, అధ్యక్షుడు మెద్వెదేవ్ లతో వ్యాపార చర్చలు జరిపారు కాని గీత వ్యవహారంపై మాట మాత్రం ప్రస్తావించలేదు. ప్రధాని తిరుగు ప్రయాణంలో ఉండగా ఇస్కాన్ ప్రతినిధులే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. దానితో భారత పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో రష్యన్ తీరును ఖండించాయి. సుష్మాస్వరాజ్ భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి రష్యా భారత్ ల మైత్రీ బంధంపై కూడా పునరాలోచించాలనే డిమాండ్లు కూడా రావడంతో రష్యా దిద్దుబాటు చర్యలు ప్రారంభించి రష్యా సెక్యులర్ దేశమని, అక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం ఉందని ప్రకటించింది. అయితే భారత్ లోని క్రైస్తవ మిషనరీలు ఈ వ్యవహారంపై ఎందుకో మౌనం వహించారు.
 
 http://www.lokahitham.net/2011/12/blog-post_10.html

No comments:

Post a Comment